ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య  | Love Failure Girl Suicide In Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య 

Jul 29 2018 10:58 AM | Updated on Nov 6 2018 8:16 PM

Love Failure Girl Suicide In Hyderabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సంతోష్‌నగర్‌ : ప్రేమ విఫలం కావడంతో ఓ యువతి శనివారం ఆత్మహత్య చేసుకుంది. సంతోష్‌నగర్‌ పోలీసులు తెలిపిన మేరకు.. సంతోష్‌నగర్‌ రవీంద్రభారతి పాఠశాల సమీపంలో ఉంటున్న రమేశ్‌ కూతురు సుష్మా (25), మాదన్నపేట్‌ ఉప్పరిగూడ ప్రాంతానికి చెందిన సంతోష్‌ కుమార్‌ యాదవ్‌లు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల సుష్మాకు ఇంట్లో సంబంధాలు చూడటం ప్రారంభించారు. దీంతో సుష్మా సంతోష్‌ కుమార్‌ను పెళ్లి చేసుకోవాలని కోరింది. తనకు కొంత సమయం కావాలని ఇప్పుడే కుదరని తెలిపాడు. వీరిద్దరి ప్రేమ విషయం సుష్మా తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో సుష్మా తల్లిదండ్రులు సంతోష్‌ కుమార్‌పై షీ టీమ్‌కు ఫిర్యాదు చేశారు.

 షీ టీమ్‌ పోలీసులు సంతోష్‌ కుమార్‌తో పాటు అతని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు.తరువాత కూడా సంతోష్‌ రావడంతో సుష్మ తల్లిదండ్రులు పోలీసులకు  ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే శనివారం ఇంట్లో నిశ్చితార్థం చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో సిలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.  ప్రియుడు పెళ్లికి స్పందించకపోవడంతో పాటు తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుందని... నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదని సూసైడ్‌ నోట్‌లో ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుష్మా మృతికి కారణమైన సంతోష్‌ కుమార్‌ను శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement