పెళ్ళై పిల్లలున్నా ప్రేమను మరువలేక.. | Love Couple Commits Suicide in Karnataka | Sakshi
Sakshi News home page

ప్రేమను మరువలేక ఆత్మహత్య

Sep 17 2019 7:42 AM | Updated on Sep 17 2019 7:42 AM

Love Couple Commits Suicide in Karnataka - Sakshi

ఇరువురికి వేరేవారితో పెళ్లయింది. సంతానం కూడా కలిగారు. మంజునాథ భార్య మరొక వ్యక్తితో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది.

కర్ణాటక, తుమకూరు: ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, కానీ విధి నాటకంలో ఇద్దరూ వేర్వేరయ్యారు. అయినా ప్రేమను మరచిపోలేక కలిసి తనువు చాలించారు. చెట్టుకు ఉరేసుకొని ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం జిల్లాలోని పావగడ తాలూకాలో చోటు చేసుకుంది. శిరా తాలూకా క్యాదిగుంట గ్రామానికి చెందిన మంజునాథ (35) అదే గ్రామానికి చెందిన అశ్విని (30) ఎంతోకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే కొన్నేళ్లక్రితం ఇరువురికి వేరేవారితో పెళ్లయింది. సంతానం కూడా కలిగారు. మంజునాథ భార్య మరొక వ్యక్తితో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టింది. దీంతో అతడు తీవ్రంగా కలత చెందాడు. తన ప్రియురాలికి విషయం చెప్పి ఇద్దరు కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ప్రేమికులు ఆదివారం రాత్రి పావగడ తాలూకా నిడగల్‌ గ్రామ సమీపంలో ఒకే చీరతో చెట్టు కొమ్మకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామస్థులు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement