ప్రేమికుడు మోసం చేశాడని.. యువతి ఆత్మహత్య | Love Cheating Girl Suicide Comments Warangal | Sakshi
Sakshi News home page

ప్రేమికుడు మోసం చేశాడని.. యువతి ఆత్మహత్య

Feb 22 2019 11:32 AM | Updated on Feb 22 2019 12:21 PM

Love Cheating Girl Suicide Comments Warangal - Sakshi

మృతి చెందిన ప్రవళిక

మహబూబాబాద్‌ రూరల్‌ : ఓ యువకుడు తనను ప్రేమించడంతో పాటు పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని లెనిన్‌ నగర్‌లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. టౌన్‌ ఎస్సై సీహెచ్‌.రమేష్‌బాబు కథనం ప్రకారం... మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని లెనిన్‌ నగర్‌కు చెందిన బూర్గుల యాకమ్మ, పాపయ్య మనుమరాలు బూర్గుల ప్రవళిక(19)కు తల్లి ఉపేంద్రమ్మ చిన్నతనంలోనే చనిపోయింది. దీంతో ఆమె అమ్మమ్మ ఇంటి వద్దే ఉంటోంది. ఇదే కాలనీకి చెందిన బల్లెం మార్కయ్య కుమారుడు చంటి, ప్రవళికలు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

ఈ క్రమంలో పెద్ద మనుషుల వద్ద పంచాయితీ కూడా నిర్వహించారు. ఈ క్రమంలో ప్రవళికను పెళ్లి చేసుకుంటానని చంటి కాగితం కూడా రాసి ఇచ్చాడు. అనంతరం పెళ్లి చేసుకోనని చెప్పడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు  ఉరివేసుకుని మృతి చెందింది. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు  బల్లెం చంటిపై ఐపీసీ 306 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్‌బాబు తెలిపారు.  మృతదేహన్ని పోస్టు మార్టమ్‌ నిమిత్తం ఏరియాస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement