జెఎంజె కాలేజ్‌ వద్ద లారీ బీభత్సం | Lorry Crashes Into Police Checkpost Tent At JMJ College In YSR District | Sakshi
Sakshi News home page

జెఎంజె కాలేజ్‌ వద్ద లారీ బీభత్సం

May 9 2020 12:28 PM | Updated on May 9 2020 12:32 PM

Lorry Crashes Into Police Checkpost Tent At JMJ College In YSR District - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ : వైఎస్సార్‌ జిల్లా నగర శివార్లలో శుక్రవారం అర్థరాత్రి పెను ప్రమాదం తప్పింది. జెఎంజె కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్‌ చెక్‌పోస్టు టెంట్‌లోకి ఒక లారీ దూసుకెళ్లింది. అయితే ఆ సయయంలో టెంట్‌లో ఎవరూ లేపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే టెంట్‌లోకి లారీ దూసుకెళ్లడంతో చెక్‌పోస్ట్‌ మొత్తం నేలమట్టమయింది. కాగా లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నపోలీసులు కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. శుక్రవారం అర్థరాత్రి దాటాకా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. కాగా మరో ఘటనలో జిల్లాలోని పోరుమామిళ్ల మండలం నాగల కుంట్ల గ్రామంలో పొలానికి నీళ్లు పెట్టే క్రమంలో ఒక్కసారి కరెంట్‌ షాక్‌ కావడంతో ఈశ్వర్‌ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement