మహబూబ్‌నగర్‌లో లారీ భీభత్సం..

Lorry Accident In Mahabubnagar 3 Lost Breath  - Sakshi

సాక్షి, జడ్చర్ల: పట్టణంలో 44వ నంబర్‌ జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోగా.. ఇందులో ఇద్దరు వలస కూలీలు, మరొకరు దుర్మరణం చెందారు. రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ లారీ అదుపు తప్పి సర్వీస్‌ రోడ్డును అనసరించి ఉన్న ఓ ఇంటిని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ సమయంలో ఇటుగా వెళ్తున్న ముగ్గురు లారీ కింద పడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. జడ్చర్ల సీఐ వీరస్వామి కథనం మేరకు వివరాలిలా.. కేరళ రాష్ట్రం పెరంబాకు నుంచి ఉత్తరప్రదేశ్‌కు పనసకాయల లోడ్‌తో లారీ వెళుతుంది. అయితే కావేరమ్మపేట వద్ద ఏఎస్‌ఆర్‌ గార్డెన్‌ ఎదుట అకస్మికంగా సరీ్వస్‌ రోడ్డుపై దారి మళ్లించాల్సి ఉండడంతో అతివేగంగా ఉన్న లారీ అదుపు తప్పి రోడ్డుకు ఎడమవైపుకు దూసుకెళ్లింది. ఎడమ వైపు సరీ్వస్‌ రోడ్డును అనసరించి ఉన్న ఇంటిని ఢీకొట్టి ఎడమవైపునకు బోల్తా పడింది. అదే సమయంలో లారీకి ఎడమవైపున అదే సర్వీస్‌ రోడ్డుపై బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు, కాలినడకన వెళ్తున్న మరో వ్యక్తి లారీ కింద పడి మృతిచెందారు. 

మృతుల్లో కావేరమ్మపేట వాసి 
లారీ కింద పడి మృతిచెందిన వారిలో ఓ వ్యక్తిని కావేరమ్మపేటకు చెందిన రఫియొద్దీన్‌(50)గా గుర్తించారు. సరీ్వస్‌ రోడ్డు దగ్గర షాద్‌నగర్‌ వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తుండగా లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. మృతుడికి భార్య హబీబున్నీసాబేగం, కుమారుడు రియాజొద్దీన్, కూతురు అయేషా ఉన్నారు.   

మరో ఇద్దరు వలస కూలీలు 
మరో ఇద్దరు కూలీలు మల్లే‹Ù(30), బంగారయ్య (24) ఇద్దరు హైదరాబాద్‌లో సిమెంట్‌ రోడ్డు నిర్మాణ పనులు చేస్తుంటారు. వీరిద్దరూ ఒకేచోట పని చేస్తున్నారు. బైక్‌పై వీరిద్దరూ అదే రూట్‌లో వెళ్తుండగా.. లారీ వీరి మీద పడింది. దీంతో వీరిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మల్లే‹Ùది కోడేరు మండలం రాజాపూర్‌ గ్రామం కాగా, అతనికి భార్య మంజుల, కుమారుడు పవన్, కూతురు భవాని ఉంది. బంగారయ్యది గోపాల్‌పేట మండలం మన్ననూర్‌ గ్రామం. ఇతనికి ఆర్నెళ్ల కిందట వివాహం కాగా, ప్రస్తుతం ఇతని భార్య గర్భిణి. మృతదేహాలను బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

డ్రైవర్‌ పరారీ 
ఇదిలాఉండగా, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్, క్లీనర్‌ పరారీలో ఉన్నారు. లారీ బోల్తాపడడంతో వెంటనే క్యాబిన్‌ నుండి బయటపడిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. వారిని పోలీసులు పట్టుకుంటే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని బావిస్తున్నారు. 

క్రేన్‌ల సహాయంతో మృతదేహాల వెలికితీత 
లారీ కింద పడి నలిగిపోయిన మృతదేహాలను భారీ క్రేన్‌ల సహాయంతో వెలికి తీశారు. లారీ టైర్ల కింద నుంచి ఇద్దరు వ్యక్తుల కాళ్లు కనిపించడంతో ఇద్దరు మృతిచెందినట్లు మొదట భావించారు. క్రేన్‌ల సహాయంతో లారీని పైకి ఎత్తి ఇద్దరి మృతదేహాలను బయటకు తీస్తున్న క్రమంలో మరో మృతదేహం కనిపించింది. దీంతో పనస కాయాలను పక్కకు తొలగించి ఆ మృతదేహాన్ని కూడా బయటకు తీశారు. తరువాత లారీని అక్కడి నుంచి ఇతర ప్రాంతానికి క్రేన్‌ల సహాయంతో తరలించారు. 

డీఎస్పీ శ్రీధర్‌ పరిశీలన 
మహబూబ్‌నగర్‌ డీఎçస్పీ శ్రీధర్‌ ప్రమాద సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి సంబందించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరస్వామి తెలిపారు.  కావేరమ్మపేట వద్ద రోడ్‌ అండర్‌బ్రిడ్జి పనులు కొనసాగుతుండడంతో ప్రధాన రహదారిని మూసివేసి సరీ్వస్‌రోడ్లపై రాకపోకలు కొనసాగించగా.. ప్రమాదం చోటుచేసుకుంది.

తప్పిన మరో పెను ముప్పు 
లారీ ప్రమాదం అరగంట ముందు జరిగి ఉంటే ప్రాణ నష్టం ఎక్కువగా ఉండే పరిస్థితి ఉండేది. లారీ ఢీకొట్టిన ఇంటిలో మొత్తం పది మంది కుటుంబ సభ్యులు ఉంటారు. లారీ వీరి ఇల్లును ఢీకొట్టిన సమయంలో ఇంట్లో సాయమ్మ, భాగ్యలక్ష్మి మాత్రమే ఉన్నారు. వీరు స్వల్పంగా గాయపడ్డారు. అంతకు ముందే చంద్రకళ, శేఖర్, స్వప్న, కృష్ణయ్య హాస్టల్స్‌లో వంట పనులు చేసేందుకు వెళ్లారు. ఇక వీరి పిల్లలు నిహారిక, నమ్రత, అజయ్, పండు స్కూల్‌కు వెళ్లారు. వీరంతా ఇంటి నుంచి వెళ్లిన అరగంట తరువాత ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడినట్లయ్యింది.

ఆర్‌యూబీ పనుల కారణంగానే..? 
జాతీయరహదారిపై ఆర్‌యూబీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు రెండేళ్లు కావస్తున్నా పనులు పూర్తిరావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జాతీయరహదారిని మూసివేసి సర్వీస్‌ రోడ్లపై రాకపోకలు కొనసాగిస్తుండడంతో నిత్యం ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గంటల తరబడి రాకపోకలు నిలచిపోయి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలోనే ప్రమాదం చోటు చేసుకుంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top