చనిపోతూ.. బిడ్డకు జన్మనిచ్చింది | In London Pregnant Woman Stabbed To Death And Give Birth To Baby | Sakshi
Sakshi News home page

8 నెలల గర్భిణిపై కత్తితో దాడి.. బిడ్డ పరిస్థితి విషమం

Jul 1 2019 9:00 AM | Updated on Jul 1 2019 9:03 AM

In London Pregnant Woman Stabbed To Death And Give Birth To Baby - Sakshi

లండన్‌ : ఎనిమిది నెలల గర్భిణిపై కత్తితో దాడి చేసి చంపిన ఘటన లండన్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా.. ఆమె గర్భంలోని శిశివును వైద్యులు బయటకు తీశారు. ప్రస్తుతం బిడ్డ పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వివరాలు.. క్రొయిడన్‌ ప్రాంతలో శనివారం రాత్రి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఎనిమిదినెలల గర్భిణి మహిళను పోలీసులు గుర్తించారు. సదరు మహిళ కత్తిపోట్లకు గురయ్యి ఉండటాన్ని గమనించిన పోలీసులు వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. అయితే మహిళ చనిపోతుందని భావించిన వైద్యులు ఆపరేషన్‌ చేసి ఆమె కడుపులోని బిడ్డను బయటకు తీశారు.

ప్రస్తుతం ఈ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మహిళ మృతితో సంబంధం ఉన్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మహిళను ఇంత దారుణంగా హత్య చేయడానికి గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement