రోడ్డు ప్రమాదంలో లైన్‌మన్‌ మృతి | Line Man Died in Road Accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో లైన్‌మన్‌ మృతి

Apr 2 2018 11:27 AM | Updated on Sep 28 2018 3:39 PM

Line Man Died in Road Accident - Sakshi

వేమనపల్లి(బెల్లంపల్లి) : పొరుగున ఉన్న మహారాష్ట్రలోని సిరోంచ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నీల్వాయికి చెందిన లైన్‌మన్‌ వెమునూరి రమేశ్‌రెడ్డి(44) మృత్యువాతపడ్డాడు. చెన్నూర్‌లో ఉంటూ విద్యుత్‌శాఖలో లైన్‌మెన్‌గా మంచిర్యాల సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. ఆదివారం మహారాష్ట్రలోని రామాంజపురంలో  శుభకార్యానికి భార్య శారదతో కలిసి వెళ్లాడు. విందు పూర్తయినా తర్వాత బైక్‌పై చెన్నూర్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు. సిరోంచ పెట్రోల్‌బంక్‌ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న టిప్పర్‌ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. అతని భార్యకు తీవ్రగాయాలు కాగా అపస్మారక స్థితిలోకి వెళ్లింది. హుటాహుటిన హన్మకొండ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాయక్క, లచ్చిరెడ్డి, తమ్ముడు మహేశ్‌ కుటుంబ సభ్యులు, మిత్రులు సిరోంచకు  వెళ్లారు. సిరోంచ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహానికి సిరోంచ ప్రాంతీయ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. మృతుడికి కుమారుడు లడ్డు, కూతురు ఉన్నారు. రమేశ్‌రెడ్డి మృతితో నీల్వాయిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

రమేశ్‌రెడ్డి(ఫైల్‌),       రమేశ్‌రెడ్డి మృతదేహం 

Advertisement
 
Advertisement
Advertisement