లిఫ్ట్‌ ఫెయిల్‌: ఇద్దరు మృతి | lift fail{ two persons died | Sakshi
Sakshi News home page

లిఫ్ట్‌ ఫెయిల్‌: ఇద్దరు మృతి

Dec 16 2017 6:59 PM | Updated on Aug 25 2018 5:33 PM

హైదరాబాద్‌ : మాదాపూర్‌లోని ఎన్‌సీసీ కార్పొరేట్ కార్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ ఫెయిల్ అవడంతో ఇద్దరు సాంకేతిక సిబ్బంది మృతిచెందారు. 11వ అంతస్తులో లిఫ్ట్‌ను నిలిపి గొలుసుతో వేలాడ దీసి మరమ్మతులు చేస్తుండగా గొలుసు తెగిపోయింది. దీంతో లిఫ్టు కిందకు పడిపోవడంతో అందులో ఇరుక్కుని వారిద్దరు మృతి చెందారు.

సేఫ్టీ బెల్టులు లేకపోవడం వల్లనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతులను జాన్‌సన్‌ కంపెనీకి చెందిన లిఫ్ట్‌ మెకానిక్‌లు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరుకు చెందిన రమేష్(21), ఖమ్మం జిల్లా కూసుమంచికి చెందిన నాగరాజు(28)గా గుర్తించారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement