సొంతపిన్నిని చంపినందుకు జీవిత ఖైదు | Life Imprisonment For Person Killing Step Mother In Warangal | Sakshi
Sakshi News home page

సొంతపిన్నినే చంపినందుకు జీవిత ఖైదు

Sep 26 2019 8:48 AM | Updated on Sep 26 2019 8:48 AM

Life Imprisonment For Person Killing Step Mother In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ : అన్నదమ్ముల భూ పంపకాల సందర్భంగా తలెత్తిన వివాదంలో కక్ష పెంచుకొని హత్యకు పాల్పడినట్లు తేలడంతో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తిరుమలాదేవి బుధవారం తీర్పు వెల్లడించారు. సొంత చిన్నమ్మను హత్య చేయడమే కాకుండా చిన్నాన్నపై హత్యాయత్నం చేసిన నేరంలో మొగుళ్లపల్లి మండలం మేదరమెట్లకు చెందిన పొన్నాల రాజుకు ఐపీసీ సెక్షన్‌ 302 క్రింద జీవిత ఖైదు విధించారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

భూమి అమ్మకం, స్వాధీనం.. ఆ పై గొడవ..
మేదరమెట్ల గ్రామానికి చెందిన పొన్నాల కొమురయ్య, రాజయ్య, ఆగయ్య, సంజీవరెడ్డి నలుగు రు అన్నదమ్మలు. వీరికి తండ్రి 4 ఎకరాల భూ మి సమభాగంగా పంచి ఇచ్చాడు. అలాగే ఉమ్మడిగా ఇల్లు ఉంది. మూడో కుమారుడైన ఆగయ్య తన వాటాగా వచ్చిన భూమిలో కొంత పెద్ద వా డైన కొమురయ్యకు అమ్మాడు. ఈ విషయంలో డబ్బు చెల్లింపు, భూస్వాధీన విషయంలో గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయతీలు జరిగాయి. ఇంతలో కొమురయ్య మృతిచెందగా ఆ యన కుమారుడు రాజు చిన్నాన్నతో గొడవపడ్డాడు. దీంతో ఆగయ్య కోర్టును అశ్రయించి త ను అమ్మిన భూమి తిరిగి కోర్టు ఉత్తర్వుల ప్రకా రం స్వాధీనం చేసుకున్నాడు.

ఈ మేరకు చిన్నాన్న వైఖరితో విసుగు చెందిన రాజు ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో 2017 జూన్‌ 8న కోర్టు ఆదేశాల మేర కు ఇరువురు మేదరమెట్లకు వచ్చి... ఉమ్మడి ఇ ల్లు పొన్నాల ఆగయ్యకు చెందేలా కోర్టు తీర్పు ఇచ్చినందునా మీకు సంబంధించిన వస్తువులు ఉంటే తీసుకెళ్లండని రాజు కుటుంబానికి చెప్పా రు. ఇంతకుముందు భూమి, ఇప్పుడు ఇల్లు స్వా ధీనం చేసుకుంటున్నారనే కోపంతో రాజు తన భార్యతో కలిసి ఉమ్మడి ఇంటికి వెళ్లాడు. మార్గమధ్యలో చిన్నాన్న ఆగయ్య – చిన్నమ్మ లక్ష్మి కూ ర్చుని ఉండగా.. ఇంటి నుంచి తెచ్చిన పదునైన కత్తితో చిన్నాన్నపై పడ్డాడు.

దీంతో తీవ్రంగా గాయపడిన ఆగయ్య పరుగెత్తగా... అక్కడే ఉన్న ఆగ య్య భార్య లక్ష్మిపై పడి పొట్ట, వీపు, గొం తుపై కత్తితో పొడవగా లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత రాజు రెండు కిలోమీటర్ల దూరంలో గల వ్యవసాయ బావి వద్దకెళ్లి కత్తి, రక్తపు మరకలు ఉన్న షర్ట్‌ను కవర్‌లో పెట్టి పారిపోయాడు. మృతురాలి కుమార్తెకు ఫోన్‌ ద్వారా సమాచారం తెలవగా ఆమె చేసిన ఫిర్యాదుతో మొగుళ్లపల్లి పోలీసులు హత్య నేరం, హత్యయత్నం ఆరోపణలతో రాజుపై కేసు నమోదు చేశారు.

ఈ మేరకు విచారణలో 19 మంది సాక్షులను విచారించిన కోర్టు జైలు శిక్ష విధించగా, ఐపీసీ సెక్షన్‌ 302 క్రింద జీవిత ఖైదు విధిస్తూ జడ్జి తిరుమలాదేవి తీర్పు ఇచ్చారు. అలాగే రూ.2500 జరిమానా కుడా విధించారు. అన్ని శిక్షలను ఏకకాలంలో అమలుపర్చాలని తీర్పులో పేర్కొన్నారు. కాగా, ఈ కేసును అప్ప టి సీఐ జి.మోహన్‌ పరిశోధించగా లైజన్‌ ఆఫీ సర్‌ డి.వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. అలాగే, సాక్షులను కానిస్టేబుల్‌ ఎం. సుభాష్‌ కోర్టులో ప్రవేశపెట్టగా, ప్రాసిక్యూషన్‌ పక్షాన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గంగిడి శ్రీధర్‌రెడ్డి కేసు వాదించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement