కిడ్నాపర్‌ రవిశేఖర్‌ అరెస్ట్‌

Kidnaper Ravishekar Arrested By Hayathnagar Police - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఫార్మసీ విద్యార్థిని సోనీని కిడ్నాప్‌ చేసిన రవిశేఖర్‌ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. కిడ్నాపర్‌ రవిశేఖర్‌ను హయత్‌నగర్‌ పోలీసులు ఒంగోలులో అరెస్ట్‌ చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి ఈ నెల 23న హయత్‌నగర్‌కు చెందిన సోనీ అనే ఫార్మసీ విద్యార్థిని రవిశేఖర్‌ కిడ్నాప్‌ చేశాడు. మిస్టరీగా మారిన ఈ కిడ్నాప్‌ కేసును చేధించేందుకు తెలంగాణ పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు దొరికిపోతాననే భయంతో సోనీని అద్దంకిలో మంగళవారం తెల్లవారు జామున వదిలి పారిపోయాడు. ప్రస్తుతం సోనీ పోలీసుల సంరక్షణలో హైదరబాద్‌కు వస్తున్నారు. 

(చదవండి : కిడ్నాప్‌కు గురైన సోనీ క్షేమం..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top