కిడ్నాప్‌కు గురైన సోనీ క్షేమం..

Pharmacy Student Soni Is Safe Who Kidnaped By Ravi Shankar In Hayathnagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బీ ఫార్మసీ విద్యార్థిని సోనీ కిడ్నాప్‌ మిస్టరీ వీడింది. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఈ నెల 23న కిడ్నాపైన సోనీ ఆచూకీ ప్రకాశం జిల్లా అద్దంకిలో దొరికింది. పలు కేసుల్లో నిందితుడైన కిడ్నాపర్‌ రవి శేఖర్‌..ఆమెను అక్కడ వదిలేసినట్లు తెలుస్తోంది. పోలీసుల సంరక్షణలో సోనీ.. హైదరాబాద్‌కు వస్తున్నట్లు సమాచారం. ఆమె బంధువులు కూడా ఆ విషయాన్ని ధృవీకరించారు. 

ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి ఏడు రోజుల క్రితం హయత్‌నగర్‌కు చెందిన సోనీ అనే ఫార్మసీ విద్యార్థినిని రవిశంకర్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. మిస్టరీగా మారిన ఈ కిడ్నాప్‌ కేసును చేధించేందుకు తెలంగాణ పోలీసులు ముమ్మరంగా గాలించారు. వారం రోజులు అయినా ఆచూకి లభ్యం కాకపోవడంతో కిడ్నాపర్‌ను పట్టించిన వారికి రూ. 1లక్ష నజరానా కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలీసులకు దొరికిపోతాననే భయంతో సోనీని అద్దంకిలో మంగళవారం తెల్లవారు జామున వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసుల సంరక్షణలో ఉన్న సోనీ హైదరాబాద్‌కు బయల్దేరినట్లుగా తెలుస్తోంది.

(చదవండి : మాటల్లో దించి కారులో..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top