వెలుగులోకి కేశినేని రమేష్‌ లీలలు

Kesineni Ramesh Arrested By Vijayawada Police - Sakshi

సాక్షి, విజయవాడ : గురుపీఠం భూ కుంభకోణం నిందితుడు కేశినేని రమేష్‌ అలియాస్‌ నవీన్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తీగ లాగాతే డొంక కదిలినట్టుగా రమేష్‌ నేరాలు వెలుగులోకి వస్తున్నాయి. భవానీ గురుపీఠం భూమి అమ్మకం పేరుతో రమేష్‌ కోటి రూపాయలు ముంచాడు. భవానీ భక్తుల ఆశ్రమం కోసం నూజీవీడులో 100 ఎకరాల భూమి ఉందంటూ రమేష్‌ అఖిల భారత భవానీ పీఠాన్ని సంప్రదించాడు. ఆ భూమికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు చూపించి విడతల వారీగా వారి నుంచి డబ్బులు తీసుకున్నాడు. అయితే 100 ఎకరాల భూమికి, రమేష్‌కు ఎలాంటి సంబంధం లేదని గుర్తించిన ట్రస్ట్‌ నిర్వాహకులు కృష్టలంక పోలీసులు అశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం రమేష్‌, అతని అనుచరుడు సబ్రమణ్యాన్నిఅరెస్టు చేశారు. అతని వద్ద నుంచి ఓ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓ కాంట్రాక్టర్‌ వద్ద రమేష్‌ పని చేస్తున్నాడు. రమేష్‌పై ఇప్పటికే పలు ప్రాంతాల్లో చీటింగ్‌ కేసులున్నాయి. 

అంతేకాక శ్రీకాకుళం మెలియాపుట్టి కురజాడ గ్రామాన్ని దత్తత పేరుతో మోసం చేసినట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని గ్రామంలో అప్పలు చేసి తప్పించుకు తిరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆ గ్రామంలో శ్రీమంతుడిగా చెలమణి అయిన రమేష్‌, రెండు నెలలు పని చేయించుకుని గ్రామస్థులకు కూలీ డబ్బులు కూడా ఇవ్వలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top