అత్యాశకు పోతే 5 కిలోల నకిలీ బంగారం!!

Karnataka Gang Cheated Kadapa Native Rs 25 Lakhs With Fake Gold - Sakshi

సాక్షి, అనంతపురం: బంగారు నాణేలు అమ్ముతామని చెప్పి కర్ణాటకకు చెందిన ఓ గ్యాంగ్ ఘరానా మోసానికి పాల్పడింది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఓ వ్యక్తి నుంచి 25 లక్షల నగదు తీసుకుని ఉడాయించింది. బత్తలపల్లి మండలం కట్టకిందపల్లి వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. ప్రొద్దుటూరుకు చెందిన బాల చెన్నారెడ్డికి బంగారు నాణేలు ఇస్తామంటూ కర్ణాటక దుండగులు ఫోన్ చేశారు. బళ్లారిలో ఇంటి పునాదులు తీస్తుండగా భారీగా బంగారు నాణేలు దొరికాయని నమ్మించారు. అతను వారి మాటలు నమ్మి అత్యాశకు పోయాడు. దుండగులు 5 కిలోల నకిలీ బంగారు నాణేలు ఇవ్వడంతో బాల చెన్నారెడ్డి వారికి రూ. 25 లక్షల నగదు ముట్టజెప్పాడు. దుండగులు అక్కడి నుంచి జారుకున్న అనంతరం బాలచెన్నారెడ్డి తాను మోసపోయానని గ్రహించాడు. బత్తలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
(చదవండి: నేను బతికే ఉన్నా సారూ!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top