దొంగను పట్టించిన బైక్‌ పెనాల్టీ

Karimnagar Police Arrested the Robber on the Basis of a Bike Penalty - Sakshi

ముపై రెండున్నర తులాల బంగారం స్వాధీనం 

తోటి ఉద్యోగులతో కలివిడిగా ఉంటూ దొంగతనం

మందమర్రిరూరల్‌(చెన్నూర్‌): తోటి ఉద్యోగుల కుటుంబాలతో కలివిడిగా ఉంటూ వారు లేని సమయంలో వారి ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన దొంగను బైక్‌ పెనాల్టీ పట్టించింది. పట్టుకుని ముప్‌పై రెండున్నర తులాల బంగారాన్ని, బైక్‌ను మందమర్రి సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ నేతృత్వంలో దేవపూర్‌ ఎస్సై దేవయ్య, కాసిపేట ఎస్సై భాస్కర్‌ స్వాధీనం చేసుకున్నారు. వివరాలను మందమర్రిలోని సర్కిల్‌ ఇన్సపెక్టర్‌ కార్యాలమంలో ఏసీపీ బాలుజాదవ్‌ సమక్షంలో శనివారం మంచిర్యాల డీసీపీ రక్షిత కే మూర్తి వివరించారు.  వివరాల ప్రకారం... తూముల శ్రీకాంత్‌ (29) 2013 నుంచి దేవపూర్‌లోని సిమెంట్‌  కంపెనీలో మెకానికల్‌ ఇంజినీర్‌గా పనిచేసేవాడు. (ప్రస్తుతం వైజాక్‌లోని  గాజువాకలో పని  చేస్తున్నాడు). చదువుకున్న వాడు కావడంతో తోటి పనివారితో, వారి కుటుంబ సభ్యులతో కలివిడిగా ఉండేవాడు. ఈ క్రమంలో ఒక మిత్రుడు కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లిన సమయంలో వారి ఇంట్లోకి చొరబడి 17తులాల, మరోసారీ మరో మిత్రుడు కుటుంబ సభ్యులతో ఊరికి వెళ్లి నప్పుడు వారి ఇంట్లోని పదిహేనున్నర తులాల బంగారాన్ని దొంగిలించాడు.

బాధితుల దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేసినా శ్రీకాంత్‌ మీద మాత్రం ఏ మాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త బడ్డారు. ఈ విషయం ఇలా ఉంటే అదే కంపేనీలో పని చేసే మరో మిత్రుని ద్విచక్ర వాహనం కూడా దొంగిలించి  కరీంనగర్‌ ప్రాంత వాసికి అప్పగించగా ఆ వాహనాన్ని డ్రైవ్‌  చేస్తున్న వ్వక్తి  చేసిన తప్పిదం వలన  రిజిస్ట్రేషన్‌ ఉన్న కంపెనీ ఉద్యోగి ఇంటికి (దేవాపూర్‌) ఫెనాల్టి రసీదు వచ్చింది. అప్పటికే వరుస దొంగతనాలు జరుగుతున్నందున్న బాధితులతో టచ్‌లోని ఎస్సై దేవయ్యకు బాధితుడు ఫెనాల్టీ రసీదు చూపించగా దాని లొకేషన్‌ వివరాలు ఆరా తీసారు. శనివారం సోమగూడం ప్రాంతంలో  పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా శ్రీకాంత్‌ అనుమానంగా కనిపించడంతో  అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో దొంగతనం గురించి వివరించాడు. ఈ కేసును చేధించిన సీఐ, దేవాపూర్‌ ఎస్సైలను డీజీపీ అభినందించారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top