నా డెత్‌ నోట్‌ అమ్మకు చూపించు: గాయని | Kannada Young Playback Singer Sushmitha Commits Suicide | Sakshi
Sakshi News home page

నన్ను వేధించిన ఎవ్వరినీ వదలొద్దు: సింగర్‌

Feb 18 2020 8:19 AM | Updated on Feb 18 2020 10:35 AM

Kannada Young Playback Singer Sushmitha Commits Suicide - Sakshi

సుష్మిత పెళ్లినాటి ఫొటో (ఫైల్‌)

యశవంతపుర: వర్ధమాన గాయకురాలు సుష్మిత సోమవారం తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అదనపు  కట్నం కోసం భర్త అత్త మామల వేధింపులే కారణమని ఆమె ఆత్మహత్యకు ముందు తన తమ్ముడికి వాట్సాప్‌ మెసేజ్‌ పంపారు. బెంగళూరులోని నాగరబావి ఇంటిలో ఉరి వేసుకుని చనిపోయారు. పలు కన్నడ చిత్రాలు, సీరియల్స్‌ ద్వారా సాండల్‌వుడ్‌లో గుర్తింపు పొందిన గాయని సుష్మిత (26) ఆత్మహత్య నగరంలో సంచలనం సృష్టించింది.

అమ్మా నన్ను క్షమించు
సుష్మిత ఆత్మహత్యకు ముందు తన తమ్ముడు సచిన్‌కు వాట్సాప్‌ మెసేజ్‌ పంపారు. ‘అమ్మా నన్ను క్షమించు, నా భర్త, వాళ్ల బంధువులు నన్ను మానసికంగా చిత్ర హింసలు పెడుతున్నారు, అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. నా తప్పునకు నేనే శిక్ష అనుభవిస్తున్నా..’ అంటూ వాట్సాప్‌ మెసేజ్‌ పంపారు. తన మరణానికి భర్త శరత్‌తో పాటు ఇతర బంధువులు వైదేహి, గీతలే ప్రధాన కారణం. పెళ్లయిన ఏడాదిన్నర నుంచి కష్టాలు అనుభవిస్తున్నా, తనను వేధించిన ఎవ్వరినీ వదలొద్దు అంటూ మెసేజ్‌ పెట్టింది. ‘అమ్మ మిస్‌ యూ...నీ కోసం తమ్ముడు సచిన్‌ ఉన్నాడు. వాడిని బాగా చూసుకో, నా డెత్‌నోట్‌ను అమ్మకు చూపించు’ అంటూ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తమ కుమార్తె ఆత్మహత్యకు భర్త, అత్తమామలే కారణమని సుష్మిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. (అమ్మా ఇది తగునా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement