కూతురిపై లైంగికదాడికి తల్లి సహకారం.. | Mother Helps Daughter Molestation in Karnataka | Sakshi
Sakshi News home page

అమ్మా ఇది తగునా?

Feb 7 2020 10:33 AM | Updated on Feb 7 2020 10:33 AM

Mother Helps Daughter Molestation in Karnataka - Sakshi

కర్ణాటక,యశవంతపుర: ఓ మహిళ తల్లి అనే పదానికి తలవంపులు తెచ్చేలా ప్రవర్తించింది. కూతురిపై లైంగికదాడికి సహకరించిన దారుణ ఉదంతం బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి, ఓ కామాంధుని దురాగతంతో 14 ఏళ్ల బాలి గర్భవతి అయింది. నేరగాడు, ఆటోడ్రైవర్‌ వినయ్‌ (22)కు బాలిక తల్లితో పరిచయం ఉంది. ఇద్దరూ కలిసి మద్యం తాగేవారు. ఆ సమయంలో తన కుమార్తెను పెళ్లి చేసుకోవాలని చెబుతూ బాలికను అతని వద్దకు పంపింది.  వినయ్‌ పెళ్లి చేసుకొంటాడు, ఏం భయం లేదు అని బాలికను మభ్యపెట్టింది. ఫలితంగా బాలిక గర్భం దాల్చింది. ఇటీవల బాలిక అవ్వ వచ్చి చూడగా అనుమానం వచ్చింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షంచగా 8 నెలలు గర్భవతిగా బయటపడింది. వెంటనే బాలిక, అవ్వ కలిసి మాగడి పోలీసులకు వినయ్, తల్లిపై ఫిర్యాదు చేశారు. వినయ్‌ పరారీలో ఉండగా, తల్లిని అరెస్టు చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement