సీకే బాబుపై హత్యాయత్నం కేసులో తీర్పు వెల్లడి | judgement relesed Today On Murder attempt on CK Babu | Sakshi
Sakshi News home page

సీకే బాబుపై హత్యాయత్నం కేసులో తీర్పు వెల్లడి

Mar 12 2018 1:50 PM | Updated on Jul 30 2018 8:37 PM

judgement relesed Today On Murder attempt on CK Babu - Sakshi

సాక్షి,చిత్తూరు: పదేళ్ల క్రితం సంచలనం కలిగించిన చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకేబాబుపై హత్యాయత్నం కేసులో 9వ అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. 2007 డిసెంబర్‌ 31న  సీకే బాబు ప్రయాణిస్తున్న కారును లక్ష్యంగా చేసుకుని నిందితులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో సీకే బాబు గన్‌మెన్‌ సురేంద్ర మృతి చెందగా, సీకే బాబుకు, అతని అనుచరులకు గాయాలయ్యాయి. దీనిపై దర్యాప్తును ప్రారంభించిన వన్‌టౌన్‌ పోలీసులు 18 మందిని నిందితులుగా గుర్తిస్తూ అప్పటి డీఎస్పీ రవీంద్రారెడ్డి, సీఐలు కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు.

సీకే బాబు సహా 81మంది సాక్షుల్ని పోలీసులు చేర్చగా, కోర్టు 51 మందిని విచారించి 13 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సోమవారం తీర్పునిచ్చింది. ఇందులో ఏ-1 నిందితుడు, టీడీపీ నాయకుడు కటారి మోహన్ మృతిచెందగా, ఏ-2 నిందితుడైన చింటూకు కోర్టు జీవితఖైదును విధించింది. మేయర్‌ కటారి అనూరాధ, ఆమె భర్త మోహన్‌ హత్య కేసులో చింటూ ప్రధాన నిందితుడుగా ఇప్పటికే వైఎస్‌ఆర్‌ కడప జిల్లా సెంట్రల్‌ జైలులో అండర్‌ ట్రయల్‌ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement