246 ప్యాకెట్ల కొకైన్‌ తిన్నాడు..విమానంలోనే..

Japanese Man Died OnBoard After Eating Cocaine - Sakshi

మెక్సికో సిటి : అత్యధిక మోతాదులో కొకైన్‌ తీసుకున్న కారణంగానే మెక్సికో ఎయిర్‌లైన్‌లో ప్రయాణించిన వ్యక్తి మృతి చెందాడని ఆ దేశ అధికారులు తెలిపారు.  ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. జపాన్‌కు చెందిన ఉడో ఎన్‌ అనే వ్యక్తి శుక్రవారం మెక్సికో నుంచి జపాన్‌ వెళ్లేందుకు విమానం ఎక్కాడు. ఈ క్రమంలో ఫ్లైట్‌ హెర్మోసిలో పట్టణం చేరుకోగానే గుండెల్లో నొప్పితో విలవిల్లాడాడు. దీంతో తోటి ప్రయాణికుల ఇచ్చిన సమాచారంతో స్థానిక ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా విమానాన్ని నిలిపివేశారు. అయితే అతడిని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు.

కాగా ఈ విషయం గురించి విచారణ జరిపిన సోనోరా అటార్నీ జనరల్‌.. మత్తు పదార్థాలు అత్యధిక మోతాదులో సేవించినందువల్లే సదరు వ్యక్తి మరణించాడని పేర్కొన్నారు. దాదాపు 246 ప్యాకెట్ల కొకైన్‌ తీసుకున్నందు వల్లే.. ఓవర్‌డోస్‌తో గుండె నొప్పి వచ్చిందని అటాప్సీ నివేదికలో ఉందన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top