ఐటీఐ విద్యార్థి బలవన్మరణం

ITI Student Commts Suicide In Visakhapatnam - Sakshi

పీఎంపాలెం(భీమిలి): చదువు పట్ల నిర్లక్షం చేయొద్దని తండ్రి చెప్పడంతో అవమానంగా భావించిన ఓ కొడుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పీఎంపాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు సీఐ లక్ష్మణమూర్తి తెలిపారు. విజయనగరం జిల్లా రామభద్రపురం ప్రాంతానికి చెందిన కొండపల్లి లక్ష్మణ ఇక్కడి ఇక్కడి ఆర్‌హెచ్‌కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు కిరణ్‌ (18)ఉన్నారు.

కిరణ్‌ నగరంలోని ఓ ప్రైవేట్‌ ఐటీఐలో చదువుతున్నాడు. చదువు పట్ల నిర్లక్ష్యం చేయొద్దని, బోలెడు ఫీజులు చెల్లించి చదివిస్తున్నామని మంగళవారం రాత్రి తండ్రి లక్ష్మణ కిరణ్‌ను మందలించాడు. దీన్ని అవమానంగా భావించిన కిరణ్‌ అందరూ నిద్రపోయిన తరువాత ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాలపడ్డాడు. బుధవారం ఉదయం ఈ దృశ్యం చూసిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. చేతికి అందొచ్చిన కొడుకు ఇలా మృతిచెందడంపై  అంతా తల్లడిల్లిపోయారు. కిరణ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు పంపించామని, తండ్రి లక్ష్మణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని సీఐ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top