కులాంతర వివాహం

Inter Caste marriage Bride Relatives Collpased Groom House Karnataka - Sakshi

వరుడి ఇంటిని ధ్వంసం చేసిన వధువు తల్లిదండ్రులు

కర్ణాటక,మాలూరు: యువతీ యువకుడు కులాంతర వివాహం చేసుకోగా వధువు తల్లిదండ్రులు వరుడి ఇంటిని ధ్వంసం చేశారు. ఈఘటన గురువారం రాత్రి తాలూకాలోని హురళగెరె గ్రామంలో చోటు చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన శశికుమార్‌(25 డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదే క్రమంలో ఇదే గ్రామానికి చెందిన రమ్య (21)తో పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరు కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి తల్లిదండ్రులు వ్యతిరేకించారు. దీంతో ప్రేమికులు ఇతర ప్రాంతానికి వెళ్లి వివాహం చేసుకొని గ్రామానికి వచ్చారు.  కోపోద్రిక్తులైన రమ్య పోషకులు  రాత్రి 11 గంటల సమయంలో శశికుమార్‌ ఇంటిపై దాడి చేశారు.  శశికుమార్‌ను చితకబాది ఇంటిని ధ్వంసం చేశా రు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  రమ్య తల్లిదండ్రులను అదుపులోకి  తీసుకున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top