ఇన్నోవా బీభత్సం.. | Innovs Accident In thirumalagiri | Sakshi
Sakshi News home page

ఇన్నోవా బీభత్సం..

Mar 11 2018 9:15 AM | Updated on Apr 3 2019 8:03 PM

Innovs Accident In thirumalagiri - Sakshi

ప్రమాదానికి కారణమైన కారు ,ప్రమాదంలో ధ్వంసమైన కారు

బొల్లారం: తిరుమలగిరి పోలీసు స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి ఇన్నోవా కారు  (టియస్‌09–ఇవి–8070) అతి వేగంతో వచ్చి భీభత్సం సృష్టించింది. పోలీసులు తెలిపిన మేరకు..  సికింద్రాబాద్‌ నుంచి  వస్తున్న కారు తిరుమలగిరి సిగ్నల్‌ పాయింట్‌ ముందు ఆర్టీఏ కార్యాలయం వద్ద  వాహనాలను డీ కోడుతూ దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో మూడు కార్లు,రెండు ద్విచక్రవాహనాలు,తో పాటు ఒక ఆటో దెబ్బతిన్నాయి. నిర్లక్ష్యంగా కారు నడిపిన నిఖిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఆటోలో ప్రయాణిస్తున్న ఇరువురికి స్వల్పగాయలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తిరుమలగిరి ఇన్‌స్పెక్టర్‌ రాజేశ్వర్‌రావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement