అక్రమ రవాణా.. ఆపై ధ్వంసం

Illegal Transport Of Ration Rice From Kazipet To Maharastra In Bhagyanagar Express - Sakshi

సాక్షి, మంచిర్యాల : రైలుమార్గం ద్వారా రేషన్‌బియ్యం తరలించడం అక్రమార్కులకు వరంగా మారింది. రైల్వే పోలీసులు గానీ, టీసీ గాని ఎవరైనా అడ్డు పడితే చాలు నయానో.. బయానో ముట్టజెప్పి తమ పని యథేచ్ఛగా సాగించుకుంటున్నారు. ఇదంతా అధికంగా కాజిపేట నుంచి మహారాష్ట్రకు వెళ్లే భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్, అజ్ని ప్యాసింజర్‌ రైళ్లలో అధికంగా జరుగుతోంది.  

భాగ్యనగర్‌ టూ మహారాష్ట్ర 
కాజిపేట నుంచి ప్రతిరోజూ సాయంత్రం 6గంటలకు బయలు దేరిన భాగ్యనగర్‌ ప్యాసింజర్‌ రైలు అర్ధరాత్రి 2గంటల ప్రాంతంలో వీరూర్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. భాగ్యనగర్‌ వెనకాల వచ్చే మరో సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ వెళ్లేందుకు ఉప్పల్, పోత్కపల్లి, ఓదెల, తదితర కొన్నిస్టేషన్లలో క్రాసింగ్‌ పెట్టి నిలిపి వేయడంతో బియ్యం రైలులో ఎక్కించుకునేందుకు అక్రమార్కులకు సమయం కలిసి వస్తోంది. దీంతో రైళ్లోని టాయిలెట్‌ రూమ్‌లన్నీ రేషన్‌ బియ్యం బస్తాలతో నింపేసి డోర్లు వెళ్లకుండా చేస్తున్నారు. నిత్యం హసన్‌పర్తిరోడ్, ఉప్పల్, బిజిగిరిషరీఫ్, పొత్కపల్లి, ఓదెల, కొలనూర్, కొత్తపల్లి, రాఘవపురం, పెద్దంపేట, మంచిర్యా ల, రవీంద్రఖని, మందమర్రి, రేచినిరోడ్‌ ఈ రైల్వేస్టేషన్ల నుంచి నిత్యం సుమారు 70నుంచి 80 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం మహారాష్ట్రకు తరలిస్తున్నారు. 

టాయిలెట్‌ డోర్లు ధ్వంసం 
గతంలో రేషన్‌బియ్యం రైల్వే పోలీసులకు పట్టుబడితే బియ్యం స్వాధీనం చేసుకోవడం లేదా బ్యాగులు చింపేసి పడేయడం లాంటివి జరిగేవి. దీంతో బియ్యం స్మగ్లర్లు తమ పంథాను మార్చుకున్నారు. టాయిలెట్‌ రూముల్లో సుమా రు 30. నుంచి 40 బస్తాలు భద్రపరుస్తున్నారు. ఒక వ్యక్తి లోపలే ఉండి డోర్‌ లాక్‌ చేసుకొని కూర్చుంటాడు. దిగాల్సిన స్టేషన్‌ రాగానే లోపల కూర్చున్న వ్యక్తి లాక్‌ తీసుకొని బయటకు వచ్చి తమ పనిని కానిచ్చేస్తారు. ఒకవేళ లాక్‌లు వెళ్లకపోతే డోర్లను సైతం పగలగొట్టి మరీ తమ బియ్యాన్ని దించుకుంటారు. దీంతో భాగ్యనగర్‌ రైల్లో టాయిలెట్‌ రూములకు లాక్‌లు ఉండడం లేదు. మరికొన్ని చోట్ల డోర్లు పూర్తిగా విరిగిపోయి ఉండడంతో టాయిలెట్‌ రూములోకి వెళ్లలేని పరిస్థితి ఉందని పలువురు ప్రయాణికులు మొర పెట్టుకుంటున్నారు. 

రైల్వే అధికారుల అండతోనే దందా... 
రేషన్‌ బియ్యం అక్రమ రవాణా రైల్వే అధికారుల అండతోనే సాగుతోందన్న ఆరోపనలు వి నిపిస్తున్నాయి. రైల్వేపోలీసులు, (ఆర్‌పీఎఫ్‌) జీఆర్‌పీ సిబ్బంది అక్రమార్కులతో దోస్తి చేయడంతో ఈ దందా మూడుపువ్వులు ఆరుకాయ లుగా నడుస్తోందన్న విమర్షలు ఉన్నాయి. ప్రతి రోజు రైళ్లలో గస్తీ తిరుగుతున్న రైల్వే పోలీసులు రేషన్‌బియ్యం స్మగ్లర్లను గుర్తించక పోవడంపై సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. రైల్వే అధికా ర యాంత్రంగం ఈ వ్యవహారం అంతా మాములుగా తీసుకోవడం తోనే రేషన్‌ స్మగ్లర్ల ఆ గడాలకు అంతులేకుండా పోయింది.  

రైల్వే ఉన్నతాధికారు ల ఆదేశాల మేరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు క్షేత్రస్థాయి సిబ్బందికి తెలియగానే  బియ్యం రవాణా చేసే వారికి కోవర్టుగా మారి సమాచారం అందిస్తున్నారన్న ఆరోపనలున్నాయి. దీంతో అక్రమ రవాణాదారులు అప్రమత్తమై మరుసటి రోజుకు వాయిదా వేసుకుంటున్నారు. దీంతో రైల్వే పోలీసులు తమ ఉనికిని చాటుకునేందుకు ఏదో ఒకరోజు టార్గెట్‌ కోసం తూతూమంత్రంగా దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఈ కేసుల్లో సైతం బియ్యం మాత్రమే దొరుకుతాయి కానీ రవాణాదారులు తప్పించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. 

అధిక ఆదాయం వస్తుండడంతోనే... 
ప్రభుత్వం రూపాయికి కిలో రేషన్‌బియ్యాన్ని పేద మధ్యతరగతి కుటుంబాలకు అందజేస్తుం టే దళారులు రూ.7 నుంచి రూ.8వరకు కొనుగోలు చేసి రైలుమార్గం ద్వారా మహారాష్ట్రలోని వీరుర్‌ ప్రాంతంలోని వ్యాపారులకు రూ.18 నుంచి రూ. 20 వరకు విక్రయిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top