గువాహటిలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య

IIT Guwahati Student Found Hanging In Hostel Room Who Is From AP - Sakshi

గువాహటి : అసోంలో తెలుగు విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పన్నెం పవన్‌ సిద్దార్థ.. గువాహటి ఐఐటీలో ఇంజనీరింగ్‌(ఈసీఈ) ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. అక్కడి కాలేజీ హాస్టల్‌లో బస చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం అతడితో మాట్లాడేందుకు కుటుంబ సభ్యులు ఫోన్‌ చేయగా అతడు లిఫ్ట్‌ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన సిద్దార్థ తల్లిదండ్రులు అతడి స్నేహితులకు ఫోన్‌ చేశారు.

ఈ క్రమంలో వారు సిద్దార్థ గదికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకుని కన్పించాడు. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సిద్దార్థ మృతి చెందాడని వైద్యులు పేర్కొన్నారు. కాగా సిద్దార్థ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అతడి తల్లిదండ్రులు గువాహటి చేరుకున్న తర్వాత పోస్ట్‌మార్టం నిర్వహించనున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top