'నేనెలాగో చావాలి. సో.. నిన్నూ చంపుతున్నా'

I Have To Die Anyway.. He Said Kicked Out Man - Sakshi

సాక్షి, భోపాల్‌ : అకారణంగా ఓ వ్యక్తి మరో వ్యక్తిని చంపేశాడు. నడుస్తున్న రైలులో నుంచి ముక్కు ముఖం తెలియని వ్యక్తి మరో వ్యక్తిని కిందికి తోసి హత్య చేశాడు. అతడిని చంపడానికి ముందు 'నేను ఎలాగో చనిపోతున్నాను.. నిన్ను కూడా చంపేస్తా' అని కేకలు పెడుతూ వచ్చి అసలు తనకు పరిచయం లేని వ్యక్తిని కిందపడేసి చంపేశాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం .. ఆదివారం మధ్యప్రదేశ్‌లో కామాయని ఎక్స్‌ప్రెస్‌లోని జనరల్‌ కోచ్‌లో రితేజ్‌ అనే వ్యక్తి డోర్‌పక్కనే కూర్చున్నాడు.

ఆ సమయంలో రితేష్‌ పక్కనే అతడి సోదరుడు సుమిత్‌ సింగ్‌, రైల్వే పోలీసులు కూడా ఉన్నారు. ఆ సమయంలో రజ్మల్‌ పాల్‌ అకా రజ్జు అనే వ్యక్తి నేరుగా రితేష్‌ వద్దకు వచ్చి తాను ఎలాగో చస్తున్నానని, అందుకు నిన్ను కూడా చంపేస్తానంటూ రితేష్‌ను అమాంతం రైలులో పడేశాడు. ఈ సంఘటన భోపాల్‌ శివారులో ఉన్న సుఖి సెవానియా రైల్వేస్టేషన్‌కు సమీపంలో చోటు చేసుకుంది. బాధితుడు, నిందితుడు ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు తెలియదు. పైగా వారిద్దరి మధ్య రైలులో ఎలాంటి గొడవ జరగలేదు. టాయిలెట్‌లో నుంచి బయటకు వచ్చిన నిందితుడు రజ్మల్‌ నేరుగా రితేశ్‌ వద్దకు వచ్చి ఇలా చేశాడు. దీంతో ప్రస్తుతం అతడిని అరెస్టు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. అతడి మానసిక పరిస్థితి బాగాలేదా కావాలనే ఇలా చేశాడా అని ఆరా తీస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top