వేధింపులపై వివాహిత ఫిర్యాదు

Husband Parents Murder Attempt ion Woman In Visakhapatnam - Sakshi

అత్తామామ, మరిది, తోటికోడలు, ఆడపడుచుగాయపరిచారని ఆరోపణ

కేసు నమోదు చేసి ఆస్పత్రికి తరలించిన గాజువాక పోలీసులు

అక్కిరెడ్డిపాలెం (గాజువాక): తనతో పాటు తన కుమార్తెను హతమార్చేందుకు అత్తమామలు, మరిది, తోటికోడలు, ఆడపడుచు యత్నించారని ఆరోపిస్తూ నెల్లి భాగ్యలక్ష్మి అనే మహిళ గాజు వాక పోలీసులను ఆశ్రయించింది. గాజు వాక డ్రైవర్స్‌ కాలనీ ఎల్‌బీ నగర్‌లో చోటు చేసుకున్న సంఘటనకు సంబం ధించి గాజువాక సీఐ కోరాడ రామారావు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన నెల్లి భాగ్యలక్ష్మికి గాజు వాక ఎల్‌బీ నగర్‌కు చెందిన అవినాష్‌తో 2013లో వివాహం జరిగిం ది.

ఆ సమయంలో  అవినాష్‌ అమెరికాలో వెల్డర్‌గా పనిచేసేవాడు. అనంతరం నగరానికి వచ్చి వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భాగ్యలక్ష్మి నిలదీసింది. అప్పుడు పొంతన లేని సమాధానం చెప్పిన అవినాష్‌ మళ్లీ అమెరికా వెళ్లిపోయాడు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి భాగ్యలక్ష్మిని అత్తమామలతోపాటు ఆమె మరిది, తోటికోడలు, ఆడపడుచు మానసికంగా, శారీరకంగా వేధించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మళ్లీ దాడి చేయడంతో బాధితురాలు భాగ్యలక్ష్మి గాయాలతో గాజువాక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తనతోపాటు తన కుమార్తెను హతమార్చేందుకు యత్నిం చారని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి శరీరంపై గాయాలు ఉండటంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపా రు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top