భార్య శవం పక్కనే వారం రోజులు | Husband Live Five Days Wife Dead Body In Karnataka | Sakshi
Sakshi News home page

భార్య శవం పక్కనే వారం రోజులు

Jul 16 2018 8:58 AM | Updated on Jul 16 2018 10:28 AM

Husband Live Five Days Wife Dead Body In Karnataka - Sakshi

సంఘటన జరిగిన ఇంటి ముందు గుమిగూడిన జనం

దొడ్డబళ్లాపురం : గుండెపోటుతో మృతి చెందిన భార్య శవాన్ని కూడా ముట్టుకోలేని స్థితిలో అచేతనంగా ఉన్న భర్త శవం పక్కనే వారం రోజులు గడిపిన సంఘటన కారవారలోని కేహెచ్‌బీ కాలనీలో చోటుచేసుకుంది. గిరిజ మడివాళ్‌ (42) గుండెపోటుతో మృతి చెందారు. ఆనంద్‌ అనారోగ్యం కారణంగా మంచానపడ్డాడు. పెరాలసిస్‌తో కదలేని స్థితిలో ఉన్న ఆయన ఏమీ చేయలేని స్థితిలో వారం రోజుల పాటు భార్య శవం పక్కనే ఉన్నాడు. కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆయనకు భార్యే సపర్యలు చేసేది. ఇళ్ల పనులు చేసే గిరిజ కొద్ది రోజులుగా రాకపోవడంతో ఆదివారం కొందరు వెతుక్కుంటూ ఆమె ఇంటికి వచ్చి చూడగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే శవం కుళ్లిన స్థితికి చేరింది. ఆనంద్‌ కూడా కొన ఊపిరితో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తదుపరి చర్యలు చేపట్టారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement