మామపై కత్తితో దాడి..అడ్డొచ్చిన భార్యను.. | husband attacked with his wife in ananthpur | Sakshi
Sakshi News home page

మామపై కత్తితో దాడి..అడ్డొచ్చిన భార్యను..

Oct 13 2017 4:17 PM | Updated on Oct 13 2017 4:17 PM

తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి మామపై కత్తితో దాడి చేశాడు.

సాక్షి, హిందూపురం: తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి మామపై కత్తితో దాడి చేశాడు. అడ్డువచ్చిన భార్యపైనా దాడి చేసి గాయపరిచాడు. అనంతపురం జిల్లా పరిగి మండలం బీచిగానిపల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మల్లప్ప శుక్రవారం పూటుగా మద్యం తాగి తన ఇంటికి వెళ్లాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండటంతో మామ మైలారప్ప(56) అడ్డు చెప్పబోయాడు.

దీంతో మల్లప్ప వేటకొడవలితో అతని తలపై కొట్టాడు. ఇది గమనించిన భార్య గంగమ్మ అడ్డురాగా ఆమెను కూడా తీవ్రంగా గాయపరిచాడు. బాధితులిద్దరినీ స్థానికులు హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement