భర్తే హంతకుడు

Husband Arrest in Wife Murder Case PSR Nellore - Sakshi

గత నెలలో వివాహిత అనుమానాస్పద మృతి

తహసీల్దార్‌ ఎదుట లొంగిపోయిన భర్త  

నెల్లూరు, వెంకటగిరి: పట్టణంలోని మందరిల్లు ప్రాంతానికి చెందిన నాశిన నాగమణి ఉరఫ్‌ నాగరత్నమ్మ అనే వివాహిత హత్య కేసులో ఆమె భర్త నాసిన నిరంజన్‌ను అరెస్ట్‌ చేసినట్లుగా గూడూరు డీఎస్పీ భూమన భవానీహర్ష తెలిపారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. రాణిపేట సమీపంలోని మందరిల్లు ఎస్టీ కాలనీ ప్రాంతానికి చెందిన నాగమణి గత నెల 28వ తేదీన తన ఇంట్లో అనుమానాస్పదంగా మృతిచెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో రెండురోజుల క్రితం మృతురాలి భర్త నిరంజన్‌ వెంకటగిరి తహసీల్దార్‌ ఎదుట లొంగిపోయి బంగారు నెక్లెస్‌ విషయంలో గొడవపడి భార్యను గొంతునులిమి హత్య చేసినట్లుగా అంగీకరించాడు. వెంకటగిరి సీఐ అన్వర్‌బాషా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేసి అరెస్ట్‌ చేశాడు. అతడిని కోర్టుకు హాజరుపరుస్తామని డీఎస్పీ తెలియజేశారు. సమావేశంలో ఎస్సైలు వెంకటరాజేష్, అనూష తదితరులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top