మూడు గంటల్లో రూ.50 లక్షలు హుష్‌కాకి | Hundreds of parents are cheated by the women | Sakshi
Sakshi News home page

మూడు గంటల్లో రూ.50 లక్షలు హుష్‌కాకి

Jan 29 2018 2:09 AM | Updated on Sep 2 2018 4:03 PM

Hundreds of parents are cheated by the women - Sakshi

హైదరాబాద్‌: మూడు గంటల్లో రూ.50 లక్షలు కాజేశారు మాయ‘లేడీలు’. ఈ నెల 26 న కూకట్‌పల్లి సుజనా ఫోరం మాల్‌లో ఘటన జరిగింది. తమ పిల్లలతో కలసి షాపింగ్‌కు వచ్చిన తల్లిదండ్రుల వద్దకు ఆరుగురు యువతులు వచ్చి ‘మీ పాపలు ముద్దుముద్దుగా ఉన్నారు. యాడ్‌ ఫిల్మ్‌లో బాగా సూటౌతారు. మీరు ఒప్పుకుంటే ఫొటోసెషన్స్‌ నిర్వహించి యాడ్స్‌ సంస్థల్లో చేర్పిస్తాం’ అని చెప్పారు. సుమారు 300 మంది తల్లిదండ్రులు వారికి తమ ఫోన్‌ నంబర్లు ఇచ్చారు. 42 యాడ్స్‌ సంస్థలకు పిల్లలు ఎంపికయ్యారని ఫొటోసెషన్‌కు రావాలని మరునాడు ఆ యువతులు  ఫోన్లు చేశారు. మెసేజ్‌లు కూడా పెట్టారు.  

ఫొటోసెషన్‌ తతంగం... 
ఆదివారం బంజారాహిల్స్‌లోని ఓ ఫొటోస్టూ డియోకు 100 మంది తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకుని వచ్చారు. పిల్లలందరికీ యువతులు ఫొటోసెషన్‌ జరిపారు.  అనంతరం పిల్లల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ‘యాడ్‌ ఫిల్మ్‌ కోసం మీ కొడుకు సెలెక్ట్‌ అయ్యాడు, వరుసగా రెండేళ్ల పాటు యాడ్స్‌ చేయాలంటే రూ.లక్ష, నాలుగేళ్లకు రెండు లక్షలు, ఆరేళ్లకు నాలుగు లక్షలు, ఎనిమిదేళ్లకు రూ.6 లక్షలు అవుతా యి’ అని టారిఫ్‌ రేట్లు ముందు పెట్టారు. ఆ మేరకు తల్లిదండ్రులు పేటీఎం ద్వారా డబ్బు లు చెల్లించారు.

తర్వాత యువతుల కోసం ఆరా తీయగా.. ఆ స్టూడియోను రెండ్రోజుల కోసం అద్దెకు తీసుకున్నారని స్పష్టమైంది. దీంతో పిల్లల తల్లిదండ్రులు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు రూ.50 లక్షల వరకు మూడు గంటల వ్యవధిలో స్వైప్‌ చేశారని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సుజనా ఫోరం మాల్‌లో సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement