షర్మిలపై అసభ్యకర కామెంట్స్‌.. వ్యక్తి అరెస్ట్‌! | Harish Chowdary Arrested Due To Trolls On YS Sharmila | Sakshi
Sakshi News home page

షర్మిలపై అసభ్యకర కామెంట్స్‌.. వ్యక్తి అరెస్ట్‌!

Mar 25 2019 11:44 PM | Updated on Mar 25 2019 11:44 PM

Harish Chowdary Arrested Due To Trolls On YS Sharmila - Sakshi

సాక్షి, క్రైమ్‌ : వైఎస్‌ షర్మిలపై అసభ్యకర కామెంట్లు చేసిన వ్యక్తిని కడప తాలుకా పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహిళల గౌరవాన్ని కించపరిచేలా తీవ్ర వ్యాఖ్యలు చేసిన దివి హరీష్‌ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైఎస్‌ షర్మిలపై అసభ్యకర కామెంట్లు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదుతో.. ఐపీ అడ్రస్‌ ఆధారంగా హరీష్‌ చౌదరిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లా బొమ్మనంపాడుకు చెందిన హరీష్‌పై 354ఏ, 509, 67ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement