వివాహమైన మరుసటి రోజే.. | Groom Suicide After Marriage In Tamilnadu | Sakshi
Sakshi News home page

నవవధువు ఆత్మహత్య

Apr 28 2018 7:14 AM | Updated on Apr 28 2018 7:14 AM

Groom Suicide After Marriage In Tamilnadu - Sakshi

మీనా (ఫైల్‌)

వేలూరు: వివాహమైన మరుసటిరోజే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన వానియంబాడి సమీపంలో గురువారం జరిగింది. వివరాలు.. వేలూరు జిల్లా వానియంబాడి నేతాజీనగర్‌కు చెందిన వినాయకం కుమార్తె మీనా (20). ఈమెకు విరిసలాంబట్టు గ్రామానికి చెందిన చిన్నస్వామి కుమారుడు గోవిందస్వామి(25)తో బుధవారం వివాహం జరిగింది. వివాహం జరిగిన వెంటనే పెళ్లి కుమార్తె ఇంటికి నూతన దంపతులు వచ్చారు.

గోవిందరాజ్‌ గురువారం సాయంత్రం పని నిమిత్తం కురిసలాంబట్టుకు వెళ్లాడు. మీన అదే ప్రాంతంలోని యువరాజ్‌ ఇంటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మీనా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో ఇంటికి వచ్చిన బంధువు ఇది గమినించి కేకలు వేశాడు. దీంతో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. వారి సమాచారంతో వానియంబాడి పోలీసులు అక్కడికి చేరుకుని మీనా మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement