ప్రయాణికురాలి నుంచి 310 గ్రాముల బంగారం స్వాధీనం | Gold Biscuits Caught From Woman In Shamshabad Airport | Sakshi
Sakshi News home page

ప్రయాణికురాలి నుంచి 310 గ్రాముల బంగారం స్వాధీనం

Dec 28 2018 11:34 AM | Updated on Dec 28 2018 11:34 AM

Gold Biscuits Caught From Woman In Shamshabad Airport - Sakshi

శంషాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో మహిళా ప్రయాణికురాలి వద్ద 310 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం జి.లక్ష్మీ అనే మహిళ ఏఐ– 952 విమానంలో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం బయలుదేరడానికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఆమె చేతి సంచిలో 310 గ్రాముల బరువు కలిగిన నాలుగు బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. బంగారానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో బంగారం స్వాధీనం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్‌ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement