టిక్‌టాక్‌ వద్దన్నందుకు మనస్తాపంతో..

Girl Away From Home After Her Mother Warned Not To Use Tik Tok In Chittoor - Sakshi

సాక్షి, చిత్తూరు(పలమనేరు) : పొద్దస్తమానం టిక్‌టాక్‌ చూస్తుంటే చదువేం కావాలని కుటుంబీకులు మందలించడంతో మనస్థాపానికి గురైన బాలిక ఇంటినుంచి పరారైన సంఘటన పలమనేరు పట్టణంలో బుధవారం వెలుగుచూసింది. స్థానిక బజారువీధిలో కాపురముండే రవి, శాంతి దంపతుల కుమార్తె భూమిక(16) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈమధ్య ఎక్కువగా మొబైల్‌లో టిక్‌టాక్‌కు చూస్తోంది. రెండ్రోజుల క్రితం తన సోదరుడు నవీన్‌తో కలసి టిక్‌టాక్‌ వీడియో చేస్తుండగా ఇద్దరిమధ్య గొడవ జరిగింది. దీన్ని గమనించిన వారి తల్లి స్మార్ట్‌ఫోన్‌ను లాక్కుని వారి దుకాణానికి వెళ్లింది. సాయంత్రం వచ్చి చూడగా ఇంట్లో కుమార్తె కనిపించకపోవడంతో బంధువుల ఇళ్లలో విచారించినా లాభం లేకపోవడంతో బుధవారం సాయంత్రం స్థానిక పోలీసులకు తన బిడ్డ ఆచూకీ తెలపాలంటూ శాంతి ఫిర్యాదు చేసింది. పట్టణ సీఐ శ్రీధర్‌ దీనిపై మిస్సింగ్‌ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top