పిన్నెల్లిపై దాడి కేసులో మరో నలుగురి అరెస్టు

Four More arrested for attack on YSRCP MLA Pinnelli Ramakrishna Reddy - Sakshi

సాక్షి, మంగళగిరి: ప్రభుత్వ విప్‌, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి కేసులో మరో నలుగురు నిందితులను మంగళగిరి పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని గ్రామం వద్ద అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 7న జరిగిన జాతీయ రహదారి దిగ్బంధం, ఆందోళనలో భాగంగా ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. 

ఈ కేసులో మరో నలుగురిని అరెస్ట్‌ చేసినట్లు మంగళగిరి రూరల్‌ సీఐ శేషగిరిరావు తెలిపారు. ఇప్పటికే తాడికొండకు చెందిన ఉన్నం రామ్మోహన్‌రావు, చినకాకానికి చెందిన సోమారపు ప్రకాశరావును అరెస్ట్‌ చేశామన్నారు. తాజాగా శనివారం చినకాకానికి చెందిన కఠారి సాంబవెంకటప్రసాద్, పిడుగురాళ్లకు చెందిన షేక్‌ ఇంతియాజ్, తాడికొండ మండలం మోతడక గ్రామానికి చెందిన ఫణిదపు వెంకటసాయి, దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన పేరూరి సత్యనారాయణను అరెస్ట్‌ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ముద్దాయిలకు కోర్టు రిమాండ్‌ విధించింది.

చదవండి: ప్రభుత్వ విప్‌ పిన్నెల్లిపై హత్యాయత్నం

పిన్నెల్లిపై హత్యాయత్నం; ఇద్దరి అరెస్టు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top