
బారాబంకీ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో కల్తీ మద్యం తాగి 14 మంది మృతిచెందారు. మరో 40 మంది అస్వస్థతకు గురయ్యారు. సోమవారం రాత్రి రామ్‌నగర్‌లో ఈ ఘటన జరిగిందని, మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు యూపీ ప్రభుత్వం ఆదేశించింది. రాజకీయ కుట్ర కోణంలోనూ విచారించాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. 10మంది ఎౖసజ్ అధికారులను, ఇద్దరు కానిస్టేబుళ్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బాధిత కుటుంబాలకు సీఎం 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనపై అన్నికోణాల్లోనూ విచారించాలని, 48 గంటల్లోగా నివేదిక అందించాలని సీఎం కోరినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు. రాణీగంజ్, దాని పరిసర ప్రాంతాల ప్రజలు సోమవారం రాత్రి రామ్‌నగర్ ప్రాంతంలోని ఓ దుకాణంనుంచి మద్యం కొనుగోలు చేశారని, మంగళవారం తెల్లవారుజామున అస్వస్థతతో స్థానిక ఆసుప్రతిలో చేరారు.
బాధితులకు దగ్గరలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పోలీస్ సర్కిల్ ఆఫీసర్, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌తో సహా బారాబంకీ జిల్లా ఎక్సైజ్ ఆఫీసర్, ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, ఐదుగురు కానిస్టేబుళ్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ముఖ్యమంత్రి ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించారని, అధికారుల పాత్రపై పూర్తి దర్యాప్తు చేపట్టాలని, వారి నిర్లక్ష్యం ఉంటే తీవ్రమైన చర్యలకు వెనుకాడవద్దని ఆదేశించినట్టు ఒక సీనియర్ అధికారి తెలిపారు. కాగా, గతంలో రాజకీయ కుట్ర కోణంలో ఇటువంటి సంఘటనలు జరిగాయని, ఉన్నత స్థాయి దర్యాప్తు బృందం ఈ దిశలోనూ విచారణ చేపట్టనున్నారు.