చెలరేగిన మృగాళ్లు

Five Mens Gang Rape On Girl In Karnataka - Sakshi

బాలికపై సామూహిక అత్యాచారం

తుమకూరు జిల్లాలో ఘోరం

తుమకూరు: కామాంధులు చెలరేగిపోయారు. బాలికకు సినిమా చూపిస్తానని చెప్పి పాడుబడిన ఫ్యాక్టరీలోకి తీసుకెళ్లి ఐదుగురు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ సంఘటన తుమకూరు జిల్లాలోని యల్లాపుర గ్రామం సమీపంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బాలిక స్నేహితుడు హరీష్‌తో పాటు మధు, కేశవ్, చిదానంద, చందు ఈ ఘోరానికి పాల్పడ్డారు. బాలికతో హరీష్‌ స్నేహంగా ఉండేవాడు. అతని మిత్రులందరూ కలిసి ఈ పన్నాగానికి కుట్ర పన్నారు. అతడు ఆమెను ఆటోలో ఎక్కించుకుని సినిమాకని బయల్దేరాడు.

మార్గమధ్యంలో అతని స్నేహితులు కూడా ఆటోలో వచ్చారు. అనంతరం యల్లాపుర సమీపంలో ఉన్న ఓ పాడు బడిన కర్మాగారంలోకి తీసుకెళ్లి ఘోరానికి ఒడిగట్టి పరారయ్యారు. బాధితురాలు తన బంధువుల సహకారంతో  పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హరీష్, చిదానందలు దొరికిపోగా, మిగతావారి కోసం గాలిస్తున్నారు.

పోలీసుల అదుపులో ఉన్న హరీష్, చిదానంద్‌

Back to Top