రేణిగుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం | Five killed, Five Injured In Chittoor District Road Accident | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Jun 7 2019 7:43 AM | Updated on Jun 7 2019 12:44 PM

Five killed, Five Injured In Chittoor District Road Accident  - Sakshi

సాక్షి, తిరుపతి : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో అయిదుగురు దుర్మరణం చెందగా, మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే...గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరం వాసులు తిరుమల స్వామివారి దర్శనానికి జైలో వాహనంలో బయల్దేరారు.  రేణిగుంట మండలం గురవరాజుపల్లి వద్ద ఆగి ఉన్న లారీని ఈ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అయిదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న రేణిగుంట అర్భన్‌ పోలీసులు గాయపడినవారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement