వరంగల్‌లో అగ్నిప్రమాదం | Fire Accident In Hanamkonda Chowrasta At Warangal District | Sakshi
Sakshi News home page

వరంగల్‌లో అగ్నిప్రమాదం

Oct 6 2019 6:58 AM | Updated on Oct 6 2019 6:59 AM

Fire Accident In Hanamkonda Chowrasta At Warangal District - Sakshi

పూల దుకాణంలో చెలరేగుతున్న మం‍టలు

సాక్షి, వరంగల్‌ అర్బన్‌: జిల్లాలోని హన్మకొండ చౌరస్తాలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చౌరస్తాలోని ఓ పూలదుకాణంలో మంటలు అంటుకొని దాదాపు ఆరు పూలదుకాణాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని.. పూల దుకాణాలకు పక్కనున్న ఏటీయం సెంటర్‌, వ్యాపార సముదాయలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకునే లోపు మంటలపై నీటిని పోస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో దగ్ధమైన దుకాణాల విలువ, మం‍టలు చెలరేగడానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement