గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌లో అగ్నిప్రమాదం | Fire Accident In Gowtham School In Payakaraopeta | Sakshi
Sakshi News home page

స్కూల్‌లో అగ్ని ప్రమాదం; చెలరేగిన మంటలు

Oct 31 2019 9:54 AM | Updated on Oct 31 2019 2:02 PM

Fire Accident In Gowtham School In Payakaraopeta - Sakshi

సాక్షి, విశాఖపట్నం : జిల్లాలోని పాయకరావుపేట గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇన్వర్టర్‌లో అనూహ్యంగా మంటలు చెలరేగడంతో  ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాగా గురువారం నాగుల చవితి రోజున  విద్యార్థులకు సెలవు కావడంతో  ప్రమాదం తప్పింది. అయితే స్కూల్‌ వాతావరణాన్ని పరిశీలించిన అధికారులు ఫైర్‌ సేఫ్టీ ప్రమాణాలు సరిగ్గా లేవని  పేర్కొన్నారు.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement