
ప్రతీకాత్మక చిత్రం
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు
గుంటూరు జిల్లా: పెదకాకానిలోని వాసవీనగర్‌లో ఉన్న ఓ పత్తి గోదాంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటల్లో దాదాపుగా పత్తి బేళ్లన్నీ దగ్ధమవుతుండటంతో ఆస్తి నష్టం రూ.కోట్లలో ఉండవచ్చునని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.