
పిల్లలను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం
కర్ణాటక, యశవంతపుర : కుటుంబ కలహాలతో ఓ తండ్రి ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తానూ ఆత్మహత్యకు యత్నించిన ఘటన హాసన్ జిల్లా బేలూరు తాలూకా ఎన్.నిడగోడు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన లోకేశ్, భార్య భాగ్యల మధ్య తరచూ కుటుంబ కలహాలు జరిగేవి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి లోకేశ్ తన ముగ్గురు పిల్లలు సష్టీ (14), స్నేహ (12), మంజునాథ్ (8)లకు విషం ఇచ్చి తాను కూడా తీసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
గురువారం తెల్లవారుజామున గ్రామస్తులు విషయం గుర్తించి నలుగురిని ఆస్పత్రికి తరించారు. లోకేశ్, సష్టీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హాసన్‌కు తరలిం చారు. దంపతుల మధ్య గొడవ కారణంగా విరక్తితో ఈ ఘటనకు యత్నించాడని సమాచారం. ఇదిలా ఉంటే తనను భర్త తరచూ కొడుతున్నాడని బుధవారం భాగ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్యకు యత్నించాడని పోలీసులు భావిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పిల్లలను పోలీసు అధికారులు పరామర్శించారు.