ఊపిరి తీసిన అనారోగ్యం | Father Killed Son And Commits Suicide in Bangalore | Sakshi
Sakshi News home page

ఊపిరి తీసిన అనారోగ్యం

Dec 3 2018 1:25 PM | Updated on Dec 3 2018 1:25 PM

Father Killed Son And Commits Suicide in Bangalore - Sakshi

తండ్రీ కొడుకుల మృతదేహాలు, ఉరికి ఉపయోగించిన చీర

కర్ణాటక, కృష్ణరాజపురం: చిన్నారి కొడుకుకు అనారోగ్యం పీడిస్తోందని ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. బాగు చేయించడానికి శతవి«ధాలా ప్రయత్నించిన విధి కనికరించలేదు. ఈ సమస్యలను తట్టుకోలేక ఆ తండ్రి కుమారుడిని హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం రాత్రి విద్యారణ్యపురంలో చోటు చేసుకుంది. చంద్రశేఖర్‌ కుమారుడు లోకేశ్‌ (7)తో కలసి అద్దె ఇంట్లో ఉండేవారు. కాగా అంగవైకల్యంతో బాధ పడుతున్న కుమారుడు లోకేశ్‌కు వైద్యం కోసం చంద్రశేఖర్‌ భారీగా ఖర్చు చేశారు.

అయినప్పటికీ లోకేశ్‌కు నయం కాకపోవడంతో చంద్రశేఖర్‌ మానసికంగా కృంగిపోయారు. ఒకవైపు ఉద్యోగం లేకపోవడం, చికిత్సకోసం, రోజువారి ఖర్చుల కోసం చేసిన అప్పులు భారీగా పెరిగిపోవడం, మరోవైపు కుమారుడి సమస్య తీవ్ర ఆవేదనకు గురిచేశాయి. రోజురోజుకు రుణదాతల ఒత్తిళ్లు, వేధింపులు తీవ్రతరం కావడంతో జీవితంపై విరక్తి చెందిన చంద్రశేఖర్‌ శనివారం రాత్రి కుమారుడు లోకేశ్‌ను గొంతు పిసికి చంపాడు. తరువాత చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మరణించాడు. డెత్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విద్యారణ్యపురం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement