కుమార్తెలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య | Father Commits Suicide With Two Daughters in Karnataka | Sakshi
Sakshi News home page

కుమార్తెలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య

Jan 4 2020 7:35 AM | Updated on Jan 4 2020 7:35 AM

Father Commits Suicide With Two Daughters in Karnataka - Sakshi

మృతి చెందిన చిన్నారులు ,భార్య పిల్లలతో మృతుడు కుమ్మట్టి (ఫైల్‌)

సాక్షి,బళ్లారి: రెండు, నాలుగేళ్ల వయసున్న కుమార్తెలకు విషం తాపించి అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఓ తండ్రి ఉదంతం  కర్ణాటకలోని కలబుర్గి జిల్లా చించోళి తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని మిరియాణ పోలీసు స్టేషన్‌ పరిధిలోని బైరంపళ్లి తండాకు చెందిన  సంజు అలియాస్‌ కుమ్మట్టి(35)డిప్లొమా పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఓ సంస్థలో పనిసేవాడు. ఈయనకు   రోహిత(4), పర్విత(2) అనే  ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలం క్రితం కుటుంబాన్ని హైదరాబాద్‌నుంచి స్వగ్రామానికి మార్చాడు. 

ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు జరిగేవి. ఈక్రమంలో గురువారం రాత్రి భార్య బయటకు వెళ్లిన సమయంలో కుమార్తెలకు విషం తాపించి బయటకు వెళ్లిపోయాడు. స్థానికులు వచ్చి గమనించగా పిల్లలు విగతజీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారుల మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా పిల్లలకు విషం ఇచ్చి వెళ్లిపోయిన కుమ్మట్టి శుక్రవారం తెలంగాణలోని తాండూరు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమేరకు అక్కడి పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement