ఆ కీచక తండ్రి అరెస్టు | Father Arrested In Molestation on Daughter Prakasam | Sakshi
Sakshi News home page

కుమార్తెపై లైంగిక దాడి కేసులో తండ్రి అరెస్టు

May 26 2018 11:13 AM | Updated on Aug 16 2018 4:21 PM

Father Arrested In Molestation on Daughter Prakasam - Sakshi

నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ రామాంజనేయులు, పక్కన సీఐ, ఎస్‌ఐ

మార్కాపురం టౌన్‌: తల్లి ఇంట్లో లేని సమయంలో కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ రామాంజనేయులు    వెల్లడించారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను ఆయన వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. దోర్నాల మండలం తుమ్మలబైలు గ్రామానికి చెందిన గుర్రయ్య కన్ను తన పదేళ్ల కుమార్తెపై పడింది. తల్లి మూగజీవాలను మేపుకునేందుకు బయటకు వెళ్లింది. తమ్ముడు ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు.

ఆ సమయంలో గుర్రయ్య తన కుమార్తెను అన్నం పెట్టాలని కోరాడు. ముందస్తు వ్యూహంలో భాగంగా లోపల జరిగే విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు టీవీ పెద్దగా పెట్టాడు. అనంతరం కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాలిక తమ్ముడు ఇంట్లోకి రావడంతో తండ్రి భయపడి బయటకు పారిపోయాడు. కుమార్తె ఐనముక్కలలోని గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తూ వేసవి సెలవులకు ఇంటికి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని గురువారం రాత్రి ఏకో టూరిజం పరిసర ప్రాంతాల్లో అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన వై.పాలెం సీఐ మల్లికార్జునరావు, దోర్నాల ఎస్‌ఐ రామకోటయ్య, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.  

పోలీసు ఉన్నతాధికారుల విచారణ
పెద్దదోర్నాల: తుమ్మలబైలు గిరిజన గూడెంలో పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం విచారణ చేపట్టారు. మార్కాపురం డీఎస్పీ రామాంజనేయులు, ఎస్‌ఐ రామకోటయ్యలు వివరాలు సేకరించారు. గూడెంలోని బాధితురాలి ఇంటిని పరిశీలించిన అనంతరం ఇరుగు పొరుగుతో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement