భార్య, పిల్లలు సహా వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Family Suicide Attempt In Tamil Nadu - Sakshi

తిరువొత్తియూరు: తిరువణ్ణామలై కలెక్టర్‌ కార్యాలయంలో భార్య, పిల్లలు సహా వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు.. సోమవారం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌డే జరిగింది. ఆ సమయంలో ఓ యువకుడు భార్య, కుమార్తె, కుమారుడితో కలిసి కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చాడు. వారివెంట తెచ్చుకున్న కిరోసిన్‌ శరీరంపై పోసుకుని అంటించుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని కిరోసిన్‌ క్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఆత్మాహుతికి యత్నించిన కుటుంబం సెంగం మేల్‌పుదూర్‌ గ్రామానికి చెందిన సేటు (30), భార్య చంద్రకళ, కుమార్తె దీప, కుమారుడు హరికృష్ణన్‌ అని తెలిసింది. పోలీసులకు సేటు మెకానిక్‌గా పనిచేస్తున్నానని, ఆటో మొబైల్‌ షాప్‌ పెట్టడానికి రూ.10 లక్షలు అప్పు తీసుకున్నానన్నాడు. అప్పు ఇవ్వడానికి సహాయం చేస్తానని చెప్పిన సెంగానికి చెందిన ప్రభుత్వ అధికారి రూ.10 లక్షల నగదు చెక్కును తీసుకుని మోసం చేశాడన్నాడు. దీనిపై కలెక్టర్‌ కార్యాలయం, ఎస్పీ కార్యాలయంలోను ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నాడు. దీంతో విరక్తి చెంది భార్య, పిల్లలు సహా ఆత్మాహుతికి చేసుకోవడానికి ప్రయత్నించినట్టు తెలిపాడు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top