తాగిన మైకంలో వరసలు మరిచి.. | Family Members Arest In Murder Case Over Molestation | Sakshi
Sakshi News home page

తాగిన మైకంలో వరసలు మరిచి..

Nov 19 2019 2:52 PM | Updated on Nov 19 2019 3:02 PM

Family Members Arest In Murder Case Over Molestation - Sakshi

మద్యానికి బానిసైన యువకుడు కుటుంబ సభ్యులపైనే లైంగిక దాడికి తెగబడటంతో యువకుడిని హతమార్చిన ఘటన వెలుగుచూసింది.

భోపాల్‌ : మద్యానికి బానిసై విచక్షణను మరిచిన యువకుడు కుటుంబ సభ్యులపైనే లైంగిక దాడికి పాల్పడటం కలకలం రేపింది. యువకుడి ఆగడాలు శ్రుతిమించడంతో కుటుంబ సభ్యులే అతడిని మట్టుబెట్టిన ఘటన  మధ్యప్రదేశ్‌లోని దాతియా ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఈనెల 12న పోలీసులకు ఓ మృత దేహం లభ్యమైంది. దీనిపై లోతైన దర్యాప్తు చేపట్టగా మృతుడి పేరు సుశీల్ జాదవ్(24) అని వెల్లడైంది. గొంతునులిమి ఊపిరాడకుండా చేయడంతో సుశీల్ మృతి చెందినట్టు పోస్ట్‌మార్టంలో తేలింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా కుటుంబ సభ్యులే యువకుడిని చంపినట్టు వెల్లడైంది.

మద్యానికి బానిసైన సుశీల్‌ జాదవ్‌ తరచూ కుటుంబ సభ్యులపై లైంగిక వేధింపులకు పాల్పడుతుండటంతో కుటుంబంలో దీనిపై నిత్యం ఘర్షణలు చోటుచేసుకునేవి. మద్యం మత్తులో సుశీల్ తన తల్లి, చెల్లి, వదినపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలపడంతో షాక్‌ తినడం పోలీసుల వంతైంది. ఈనెల 11న కూడా మద్యం సేవించి వచ్చిన సుశీల్‌ వావివరసలు మరిచి వదినపై లైంగిక దాడికి ప్రయత్నించాడని, సుశీల్‌ పీడ వదిలించుకోవాలని తాము అతడిని హత్య చేశామని సుశీల్ కుటుంబ సభ్యులు నేరాన్ని అంగీకరించారు.దీంతో హత్య కేసు నమోదు చేసిన పోలీసులు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement