
కొండలావేరు పంచాయతీ కార్యాలయం
అదో గిరిజన పంచాయతీ. గ్రామంలో తాగునీటి సమస్య ఉంది. అదనంగా మరో ట్యాంకు నిర్మించాల్సి ఉంది. ఈ పంచాయతీ పరిధిలోని మధుర గ్రామాల్లో వీధులకు ఇంకా సీసీ రోడ్లు, కాలువలు నిర్మించాల్సి ఉంది. ఈ పనులు చేపట్టేందుకు కావలసిన నిధులు పంచాయతీ ఖాతాలో ఉన్నాయి. కానీ వాటిని తీయడానికి సర్పంచ్ భయపడుతున్నారు.
కారణం ఈ పంచాయతీలో పలు వార్డులకు ఎన్నికలు జరిగినా... ఏకగ్రీవ ఎన్నికలు జరిగినట్టు తప్పుడు నివేదిక పంపించి నజరానాగా తెచ్చుకున్న నిధులే అవి. వాటిని ఖర్చుచేసేందుకు సాహసించక... సర్కారుకు జమచేస్తే గుట్టుకాస్తా రట్టవుతుందేమోనన్న భయంతో అలా నిధులు మగ్గబెడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : పథకాల అమలులోనే ఇంతవరకూ అవినీతి చోటు చేసుకున్న వైనం చూశాం గానీ... ఏకంగా ఎన్నికల కమిషన్‌నే తప్పుదారి పట్టించిన సంఘటన ఎక్కడా చూడం. కానీ మెరకముడిదాం మండలం కొండలావేరు గిరిజన పంచాయతీ 2013లో ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల కమిషన్ కు, ప్రభుత్వానికి నివేదికనిచ్చి రూ.7 లక్షల ప్రోత్సాహకాన్ని తీసేసుకున్నారు. కానీ వాస్తవాని కి ఈ పంచాయతీలోని నాలుగు వార్డులకు ఎన్నికలు జరిగాయి.
ఈ విషయాన్ని దాచిపెట్టి డబ్బులు పొందిన విషయం సాక్షి పరిశోధనలో స్పష్టమైం ది. నీ ఆ నిధులు గ్రామ అభివృద్ధికైనా విని యోగించారా అంటే అదీ లేదు. నేటికీ పంచా యతీ అకౌంట్లోనే మురుగుతోంది. వెనక్కి పంపి తే సమాధానం చెప్పుకోవాల్సి రావడమేగాకుండా... తప్పు ఒప్పుకోవాల్సి వస్తుందని అక్కడి టీడీపీ సర్పంచ్ సిహెచ్ బంగారు నాయుడు ఆ నిధులు వాడకుండా, వెనక్కి పంపకుండా ఉంచేశారు.
అసలేం జరిగిందంటే...
2013–14 పంచాయతీ ఎన్నికల్లో ఈ పంచాయ తీ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. అయితే పది వార్డుల్లో ఆరిం ట ఏకగ్రీవం కాగా మిగిలిన నాలుగు వార్డులకు (5, 6, 7, 9 వార్డులు) ఎన్నిక జరిగింది. అలాగే 4వ వార్డులో అభ్యర్థుల నామి నేషన్లను తిరస్కరించడంతో ఆ వార్డుకు మరలా కొద్దిరోజుల తరువాత ఎన్నిక జరిగింది. ఈ లెక్క న మొత్తం ఐదు వార్డులకు ఎన్నికలు జరిగాయి.
అయినప్పటికీ టీడీపీ నేతల ఒత్తిళ్లతో అప్పటి ఎంపీడీఓ సిహెచ్.సుబ్బలక్ష్మి ఈ పంచాయతీ ఏకగ్రీవమైన ట్టు జిల్లా ఉన్నతాధికారులకు, ఎన్నికల కమిషన్ కు నివేదికను పంపించి వారిని తప్పుదోవ పట్టిం చారు. నిజానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్క వార్డుకు ఎన్నిక జరిగినా ఏకగ్రీవం కానట్టే. కానీ తప్పుడు నివేదిక అందించడంతో ప్రభుత్వం ముందుగా ప్రకటించిన మేరకు ఏకగ్రీవమైన పంచాయతీలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహక మొత్తం రూ.7 లక్షలు కొండలావేరు పంచాయతీకి మంజూరయ్యాయి.
నిధుల ఖర్చుకు వెనుకడుగు
నిధులు విడుదలైన తర్వాత సర్పంచ్‌కు వాటిని వినియోగిస్తే అసలు విషయం బయటపడుతుం దనే భయం పట్టుకుంది. పలుమార్లు ఈ నిధుల ను డ్రాచేసేందుకు ప్రయత్నించినప్పటికీ చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. ఇలా నాలుగేళ్లుగా ఆ నిధులు పంచాయతీ అక్కౌంట్‌లో మూలుగుతున్నాయి. నిజానికి ఈ నిధులను చలానా తీసి జిల్లా పంచాయతీ అధికారి వారి సూచనల మేరకు ప్రభుత్వానికి తిరిగి వెనక్కి పంపించాలి.
కానీ అలా పంపించలేదు. పంపిస్తే ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్‌ను తప్పుదోవ పట్టించిన నేరాన్ని అంగీకరించాల్సి వస్తుందని ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. ఈ విషయాలేవీ గ్రామస్తులకు తెలియకుండా జాగ్రత్తపడుతూ వస్తున్నారు. ఈ వంచనను పసిగట్టిన ‘సాక్షి’ వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది.
చివరికి సమాచార హక్కు చట్టాన్ని అస్త్రంగా వాడటం తో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడీ నిధులను ఏం చేస్తారు?..తప్పు చేసిన అధికార పార్టీ సర్పంచ్, అప్పటి అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది జిల్లా కలెక్టర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
ఏకగ్రీవానికి వచ్చిన నిధులు డ్రాచేయలేదు
సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీ వం అయ్యాయని మా పం చాయితీకి రూ.7 లక్షలు నిధులు వచ్చాయి. అయితే పంచాయతీ ఏకగ్రీవం కాలేదు. కొన్ని వార్డుల్లో ఎన్నిక జరగడంతో ఏకగ్రీవం కానట్టేనని కొందరు అధికారులు చెప్పడంతో ఆ నిధులను డ్రా చేయకుండా అలాగే పంచాయతీ అక్కౌంట్‌లో ఉంచేశాం. – సీహెచ్.బంగారునాయుడు, సర్పంచ్, కొండలావేరు
జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం
కొండలావేరు పంచాయతీ కి ఏకగ్రీవ నజరానాగా వచ్చిన రూ.7 లక్షల విషయమై జిల్లా ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి, ఆ నిధులను వెనక్కి పంపిస్తాం. ఆ నిధులను డ్రా చేయకుండా ఇప్పటికే మా పంచాయతీ విస్తరణాధికారి సర్పంచ్, కార్యదర్శులకు సూచించడంతో ఆ నిధులను డ్రాచేయకుండా అలాగే పంచాయతీ అకౌంట్‌లో వుంచారు. ఉన్నాతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపడతాం. – ఎ.త్రినాథరావు, ఎంపీడీఓ, మెరకముడిదాం.
నిధులు డ్రా చేయలేదు
పంచాయతీ ఏకగ్రీవమైనట్టు వచ్చిన రూ. 7 లక్షలు డ్రా చేయలేదు, వాటిని పంచాయతీ అక్కౌంట్‌లోనే వుంచాం. జిల్లా, మండల అధికారుల సూచనల మేరకు వారి ఆదేశానుసారం చర్యలు చేపడతాం. – బి.గోవింద్, పంచాయతీ కార్యదర్శి, కొండలావేరు