సొంత చెల్లెలిపై లైంగిక వేధింపులు

Elder Brother Molested His 10 Years Old Younger Sister In Gurugram - Sakshi

చండీగఢ్‌ : తోడబుట్టిన చెల్లెలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో కామాంధుడు. బలవంతంగా పదేళ్ల చెల్లెలి గొంతులో మధ్యం పోసి లైంగిక వేధింపులకు గురిచేశాడు ఓ అన్న. ఈ సంఘటన హర్యానాలోని పాలెం విహార్‌లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హర్యానా రాష్ట్రంలోని పాలెం విహార్‌ కార్టర్‌పురి గ్రామానికి చెందిన పదేళ్ల బాలిక మూడవ తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లిపోవటంతో బాలిక తన చిన్న తమ్ముడితో కలిసి ఇంట్లో ఉంది.

ఆ సమయంలో ఇంట్లోకి వచ్చిన బాలిక పెద్ద అన్నయ్య ఆమె నోట్లో బలవంతంగా మధ్యం పోశాడు. తోడబుట్టిన చెల్లి అని చూడకుండా పైశాచికంగా ప్రవర్తించాడు. బాలిక గట్టిగా అరవటంతో పక్కగదిలో ఉన్న బాలిక తమ్ముడు ఇది గ్రహించి బిగ్గరగా అరుస్తూ తల్లికి సమాచారమిచ్చాడు. దీంతో భయానికి గురైన ఆ కీచకుడు అక్కడినుంచి పరారయ్యాడు. బాలిక తల్లి పోలీసులకు సమాచరామివ్వటంతో వారు పరారీలో ఉన్న నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top