తమ్ముడి మృతిని తట్టుకోలేక మానసిక వేదనతో జగదీష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
సాక్షి, మహబూబాబాద్ : చిన్నప్పటినుంచి ప్రాణస్నేహితుల్లా మెదిలిన ఆ అన్నదమ్ముల్లో ఒకరు ప్రేమ విఫలమై ప్రాణాలు తీసుకున్నారు. మరొకరు తోబుట్టువు లేని ఒంటరి జీవితం గడపలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన జిల్లాలోని బయ్యారం మండలం రావికుంట గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. కలవల జగదీష్ (21) తమ్ముడు హరిబాబు ప్రేమ విఫలమవడంతో మూన్నెళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. తమ్ముడి మృతిని తట్టుకోలేక మానసిక వేదనతో జగదీష్ మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
