
ప్రతీకాత్మకచిత్రం
సైంటిస్ట్‌గా నమ్మబలుకుతూ మహిళను మోసం చేసి వివాహం చేసుకున్న ఆవారాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
న్యూఢిల్లీ : గతంలో పెళ్లై ఆవారాగా తిరిగే ప్రబుద్ధుడు తాను డీఆర్‌డీఓ సైంటిస్ట్‌నని, అవివాహితుడనని ఢిల్లీకి చెందిన ఓ మహిళను బురిడీ కొట్టించిన ఘటన దేశ రాజధానిలో వెలుగుచూసింది. తనను పెళ్లి చేసుకునేందుకు నిందితుడు ఫోర్జరీ ఐడీ కార్డులను చూపాడని తీరా పెళ్లయిన తర్వాత అతడు మోసగాడని, ఎలాంటి ఉద్యోగం లేదని పైగా గతంలోనే వివాహమైందని తెలిసిందని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు జితేంద్ర సింగ్‌పై ద్వారకా నార్త్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని చెప్పారు.